అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో తాను సంధ్య థియేటర్‌లో అభిమానులతో కలిసి పుష్ప-2 చూస్తున్నప్పుడు తనకు బయట ఏం జరిగిందో తెలీదని, ఎవరూ తనకు చెప్పలేదని, పోలీసులు ఎవరూ తన వద్దకు రాలేదని చెప్పారు.
కానీ అల్లు అర్జున్ అబద్దం చెప్పారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు చెప్పారు. ఇందుకు సాక్ష్యంగా ఆనాడు డీసీపీ, ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ వెంకట రాజు ముగ్గురూ కలిసి థియేటర్‌లోకి వెళుతున్న దృశ్యాలను, వారు అల్లు అర్జున్‌ని బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు.
బయట జరిగిన ఘటన గురించి తాము అల్లు అర్జున్‌కి వివరించి తక్షణమే థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన తర్వాతే అల్లు అర్జున్ వెళ్లిపోయారని, అప్పుడు కూడా మళ్ళీ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారని చెప్పారు.
బహుశః అల్లు అర్జున్ తన న్యాయవాదుల సూచనమేరకు ఆవిదంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ పోలీసులు ఆరోజే సాక్ష్యాధారాలన్నీ సేకరించి భద్రపరచడంతో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో అబద్దం ఆడిన్నట్లు వెంటనే నిరూపించి చూపారు.
అల్లు అర్జున్ నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పి ఉంటే ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చి ఉండేదే కాదని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పింది నిజమే అనిపిస్తుంది.
(Video Courtecy: RTV and BigTV Breaking News )