కేసీఆర్‌ కోసం ఫార్ములా రెడీ.. కేసు నమోదు

తాజా సమాచారం ప్రకారం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ పేరుని ఏ-1గా, మున్సిపల్ శాఖ కార్యదర్శిగా చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ ఏ-2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌ రెడ్డిని ఏ-3గా చేర్చింది. వీరిలో కేటీఆర్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన్నట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టేందుకు ఇటీవలే తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి, ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా అవినీతి నిరోధక శాఖని ఆదేశిస్తూ లేఖ వ్రాశారు. ఆమె ఆదేశం మేరకు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ తదితరులపై కేసు నమోదు చేశారు.