తెలంగాణ శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకో వేషంలో వస్తూ రోజుకో డ్రామా చేస్తున్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ రోజు ‘రాహుల్ గాంధీ-అదానీ బాయ్ బాయ్’ అని వారిద్దరి బొమ్మలు ముద్రించిన టీ షర్ట్స్ వేసుకొని శాసనసభకు రాబోతే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
లగచర్ల రైతు హీర్యా నాయక్ బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్ళడాన్ని నిరసిస్తూ, మంగళవారం అందరూ నల్ల దుస్తులు, చేతులకు బేడీలు ధరించి శాసనసభకు వచ్చారు.
ఇవాళ్ళ ఆటో డ్రైవర్ల యూనిఫారం (కాకీ చొక్కాలు) ధరించి ఆటోలలో శాసనసభకు చేరుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ స్వయంగా ఓ ఆటో రిక్షాని నడిపిస్తూ కొంత మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు చేరుకున్నారు.
వారందరూ ప్లకార్డులు పట్టుకొని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ శాసనసభలోకి ప్రవేశించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ సమావేశలంటే చాలా చులకనగా భావిస్తున్నట్లున్నారు. అందుకే రోజుకో వేషం వేసుకొని వచ్చి శాసనసభలో డ్రామాలు ఆడుతున్నారు.
బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉంది. ఏనాడైనా ఆర్టీసీ కార్మికుల, ఆటో డ్రైవర్ల గోడు విందా? కనీసం వారి సమస్యలేమిటో బిఆర్ఎస్ పార్టీకి తెలుసా?అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఆటో డ్రైవర్ల కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఎక్కువగా ఉండటం వలననే ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12,000 ఇవ్వలేకపోయాము. కానీ వచ్చే ఏడాది తప్పకుండా ఇస్తాము,” అని చెప్పారు.
ఆటో కార్మికులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు: పొన్నం
— ChotaNews (@ChotaNewsTelugu) December 18, 2024
ఆటో కార్మికులపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.… pic.twitter.com/b7aSTZjcIX