శనివారం ఉదయం అల్లు అర్జున్ చంచల్‌గూడా జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకోగానే టాలీవుడ్‌లో ప్రముఖులందరూ ఒకరి తర్వాత ఒకరు జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ నేతలకు అసహనం కలిగిస్తోంది.
సీనియర్ కాంగ్రెస్ నేత దరిపల్లి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నువ్వు అల్లు అర్జున్ అనుకో లేదా అల్లుడు శ్రీను అనుకో ఎవరైనా సరే చట్టం ముందు తగ్గాల్సిందే.. చట్టానికి అందరూ సమానమే. సినిమా వాళ్ళకు ప్రత్యేకమైన రాజ్యాంగం, చట్టాలు ఉండవు. నేను తెలుగు సినీ పరిశ్రమకి చెందిన వారందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరందరూ అల్లు అర్జున్ మీద ఎందుకు ఎంత ఉత్సాహం చూపిస్తున్నారు?” అని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు. పుష్ప-2 తర్వాత ఆయన మరింత ఎత్తుకు ఎదిగారు. ఆయన తండ్రి అల్లు అర్వింద్ ప్రముఖ నిర్మాత. గీతా ఆర్ట్స్ సినీ నిర్మాణ సంస్థ ద్వారా అనేక సినిమాలు చేస్తుంటారు. వారు మెగా స్టార్ చిరంజీవికి బంధువులు.
కనుక సినీ పరిశ్రమలో చాలా ఉన్నత స్థానంలో ఉన్న వారిని పలకరించి సంఘీభావం తెలిపేందుకు సినీ పరిశ్రమలో వారు వెళ్ళడం సహజం.
ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌ని పలకరించేందుకు ఎందుకు వెళుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటే సామాన్య ప్రజలు, ముఖ్యంగా అభిమానులకు ఆగ్రహం కలుగుతుంది. వారందరూ అల్లు అర్జున్‌ని పరామర్శించి వస్తున్నారే తప్ప ఎవరూ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు కదా? అటువంటప్పుడు కాంగ్రెస్ నేతలకు అభ్యంతరం దేనికి?
అల్లు అర్జున్ అయినా అల్లుడు శ్రీను అయినా తగ్గాల్సిందే
చట్టం ముందు తల వంచాల్సిందే
సినిమా వాళ్ళు అల్లు అర్జున్ మీద అంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నారు - కాంగ్రెస్ నేత దరిపల్లి రాజశేఖర్ రెడ్డి pic.twitter.com/M47KLH3sox