ఆధార్ అప్‌డేట్‌ గడువు పొడిగింపు

ఇప్పుడు ప్రతీదానికి చివరికి.. ఆర్టీసీ బస్సులో రాయితీ లేదా ఉచిత ప్రయాణం చేయాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి. కనుక దాదాపు దేశ ప్రజలందరూ ఆధార్ కార్డు తీసుకొని వినియోగించుకుంటున్నారు.

అయితే ప్రతీ పదేళ్ళకు ఓసారి ఆధార్ కార్డులో చిరునామా, వయసు, వేలి ముద్రలు, ఐరిస్ వగైరా అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. అప్పుడే ఆధార్ కార్డు సక్రమంగా ఉన్నట్లు పరిగణించబడుతుంది. కనుక దీని కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏ) ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది.

దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, జిల్లా, మండల కేంద్రాలలో ఉచితంగా ఆధార్ అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. కానీ నేటికీ దేశంలో కోట్ల మంది వివిద కారణాల వలన ఆధార్ అప్‌డేట్‌ చేసుకోలేదు.

కనుక వారి సౌకర్యార్ధం 2025, జూన్ 14 వరకు గడువు పొడిగిస్తున్నట్లు యూఐడీఏ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కానీ ఈ ఉచిత సేవ ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ చేసుకునే వారికి మాత్రమే. ఆధార్ సేవా కేంద్రాలలో అప్‌డేట్‌ చేసుకోవాలంటే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌ చేసుకోవాలనుకునే వారు అన్ని పత్రాలు సిద్దంగా ఉంచుకొని యూఐడీఏ అధికారిక పోర్టల్లో లాగిన్ అయ్యి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.