ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. కేటీఆర్ ఎమ్మెల్యే కనుక ఆయనపై కేసు నమోదు చేసేందుకు, అరెస్ట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కోరామని, అనుమతించగానే కేటీఆర్‌ని అరెస్ట్‌పై చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే చెప్పారు.
దీపావళి ముందు ఈ ధమాకా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కానీ గవర్నర్ అనుమతి లభించకపోవడంతో కాంగ్రెస్ మంత్రులెవరూ మళ్ళీ ఆ ప్రస్తావన చేయలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం, కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.
ఫార్ములా వన్ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సదరు నిర్వాహక సంస్థలకు మద్య ఏవిదంగా ఒప్పందాలు జరిగాయి.. మద్యలో ఎటువంటి పరిణామాలు జరిగాయి.. అప్పుడు కేటీఆర్ చొరవ తీసుకొని సదరు సంస్థలకు రూ.46 కోట్లు డాలర్ల రూపంలో చెల్లించడం వంటి వివరాలను ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు గవర్నర్‌కు వివరించారు.
రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, హెచ్ఎండీఏ ప్రమేయం లేకుండా అంత మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలో విదేశీ సంస్థలకు చెల్లించడం తీవ్రమైన ఆర్ధిక నేరాలని అధికారులు గవర్నర్‌కు చెప్పిననట్లు తెలుస్తోంది. కనుక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్‌పై నమోదు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం లేదా పోలీసులు ఈవిషయం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ గవర్నర్ అనుమతించిన్నట్లయితే, నేడో రేపో పోలీసులు ఎలాగూ కేసు నమోదు చేస్తారు కనుక త్వరలోనే ఏం జరుగబోతోందో తెలుస్తుంది.