నోట్ల రద్దు కారణంగా దేశంలో తలెత్తిన సమస్యలని నిశితంగా గమనిస్తున్న కేంద్రప్రభుత్వం ఈరోజు మళ్ళీ కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రకటించింది. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ మీడియా సమావేశంలో ఏమి చెప్పారంటే,
1. రేపటి నుంచి (నవంబర్ 18) పాత నోట్ల మార్పిడి పరిమితిని రూ.4000 నుంచి రూ.2,000కి తగ్గించి వేసింది.
2. పెళ్ళిళ్ళ కోసం గుర్తింపు కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ సమర్పించి బ్యాంకుల నుంచి రూ.2.5 లక్షలు నగదు తీసుకోవచ్చు.
3. కేంద్రప్రభుత్వం ఉద్యోగులలో ‘గ్రూప్ సి’ ఉద్యోగుల స్థాయి వరకు జీతంలో అడ్వాన్సుల కోసం రూ.10,000 నగదు డ్రా చేసుకోవచ్చు.
4. పంట రుణాలు మంజూరు అయిన రైతులు తమ ఖాతాలలో నుంచి వారానికి రూ.25,000 డ్రా చేసుకోవచ్చు.
5. కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్లకి కూడా ఇదే వెసులుబాటు ఉంటుంది.
6. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఉత్పత్తిదారులుగా పేర్లు నమోదు చేసుకొన్న రైతులు లేదా వ్యాపారులు వారానికి రూ.50,000 తమ బ్యాంక్ ఖాతాల నుంచి నగదు తీసుకోవచ్చు.
7. ఇప్పటికే అకౌంట్ ఉన్న రైతులకి, రునపరిమితికి లోబడే నగదు తీసుకోవలసి ఉంటుంది.
8. రైతుల రుణాలపై చెల్లించవలసిన ప్రీమియం గడువు మరో 15 రోజులకి పొడిగించబడింది.
9. దేశ వ్యాప్తంగా ఉన్న ఎటిఎంలలో కొత్త నోట్లని జారీ చేసేందుకు వీలుగా అవసరమైన టాస్క్ ఫోర్స్ ని నియమిస్తున్నట్లు చెప్పారు.
10. దేశ ప్రజల అవసరాలకి సరిపడంత నోట్లు సిద్దంగా ఉన్నాయని శక్తికాంత్ దాస్ చెప్పారు.