బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుని నిరసిస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఓ పిర్యాదు చేసేందుకు వెళితే, పిర్యాదు తీసుకోకపోగా తిరిగి ఆయనపైనే కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్‌లో నిర్భందించి ఉంచడాన్ని నిరసిస్తూ వారు ధర్నా చేస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, “ఇది ఇందిరమ్మ రాజ్యం అంటూ పోలీసుల రాజ్యంగా మార్చేసిండీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ పాలనలోనే దేశంలో ఎమర్జన్సీ విధించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా రాష్ట్రంలో ఎమర్జన్సీ విధించిన్నట్లే ప్రశ్నించే గొంతులను ఈవిదంగా అణగద్రొక్కుతున్నారు.
ఓ ప్రజాప్రతినిధి పోలీస్ స్టేషన్‌కు వస్తే ప్రోటోకాల్ పాటించాల్సింది పోయి తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్స్ తో అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్‌లో ఇంత సేపు నిర్భదించి ఉంచడం చాలా దారుణం. మేము కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను, వైఫ్యల్యాలను ఎండగడుతున్నందునే రేవంత్ రెడ్డి మాపై కక్ష కట్టి ఈవిదంగా పోలీసులతో వేధిస్తున్నారు.
కానీ ఇటువంటి రాక్షస పాలన చేస్తే ప్రజలు తప్పకుండా తిరగబడతారు. మాపై ఎన్ని కేసులు నమోదు చేసి ఎంతగా వేధించినా మా పోరాటాలు ఆగవు. కేసులు, అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆపలేదని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.
ఎమ్మెల్యే @KaushikReddyBRS గారిని అక్రమంగా అరెస్ట్ చేసి, ఉదయం 9 గంటల నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన పోలీసులు. కౌశిక్ రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు. pic.twitter.com/zhqEYwWKzP