ఈరోజు ఉదయం 7.27 గంటలకు హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైన ఈ భూప్రకంపనల కేంద్రం ములుగులో ఉన్నట్లు గుర్తించారు. కనుక జిల్లాలోని మేడారంలోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో కూడా ఈ భూప్రకంపనల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అదే సమయానికి కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు భూమి కంపించింది. ఆయా ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలలో ఆ భూప్రకంపనలు చాలా స్పష్టంగా కనిపించాయి.
ఈ భూప్రకంపనలు పూర్తిగా తగ్గిపోయినా ప్రజలు ఇళ్ళలోకి వెళ్ళేందుకు భయపడి చాలాసేపు బయటే ఉండిపోయారు. కానీ మళ్ళీ ప్రకంపనలు రాకపోవడంతో అందరూ ఇళ్ళలోకి వెళ్ళి రోజువారీ పనులు చేసుకున్నారు.
(Video Courtecy: NewsLineTelugu)