బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ (బిబిసి) ప్రసారం చేసే వార్తలకున్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. అత్యున్నత ప్రమాణాలతో, నిష్పక్షపాతంగా దాని వార్తలుంటాయి. ఇప్పుడు బిబిసి కొత్తగా 11 భారతీయ భాషలలలో వార్తలు ప్రసారం చేయబోతోంది. వాటిలో తెలుగు కూడా ఒకటి. ఇప్పటికే అది హిందీ, బెంగాలీ, తమిళ బాషలలో వార్తలు ప్రసారం చేస్తోంది. దేనితో ఇప్పుడు ఆ సంఖ్య 14 భారతీయ భాషలలో ప్రసారం చేస్తున్నట్లవుతుంది. దీని కోసం అది భారత్ లో వార్తలని సేకరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకొంతోంది. భారత్ విభాగంలో కొత్తగా 157మంది ఉద్యోగులని నియమించుకోబోతోంది. భారత్ తో బాటు కొరియా, ఆఫ్రికా దేశాలకి చెందిన 6 భాషలలో కూడా ప్రసారాలు మొదలు పెట్టబోతోంది. బిబిసి ఏర్పాటు చేసిన తరువాత ఒకేసారి ఇన్ని భాషలలో వార్తలు ప్రసారం చేయడానికి సిద్దపడటం ఇదే మొదటిసారి. అయితే బిబిసి ప్రవేశంతో భారతీయ మీడియాకి ..ముఖ్యంగా జాతీయ మీడియాపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. ఎందుకంటే బిబిసి ఎంత గొప్ప అంతర్జాతీయ న్యూస్ ఛానల్ అయినప్పటికీ అది పూర్తి స్థాయిలో భారత్ లో అడుగుపెట్టడం లేదు కనుక.