ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 6 నెలలు తిహార్ జైల్లో ఉండి బెయిల్‌పై ఇంటికి తిరిగి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాటి నుంచి రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోయారు. కానీ అమెరికా కోర్టులో అదానీ బృందంపై కేసు నమోదైన వార్త దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా రావడంతో తొలిసారిగా ఆమె మౌనం వీడి సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించారు.
“అఖండ భారతంలో అదానికో న్యాయం... ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా?ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??” అని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.
ఆమె ప్రశ్నకు ఓ నెటిజన్ చక్కటి సమాధానం చెప్పారు. అతను ఏమన్నారో అతని మాటల్లోనే...
మేడం మిమ్మల్ని టచ్ చేస్తే ఇండియన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేలా ఉంటే మీ ఇంటి గెట్ కూడ తాకరు. అసలు సగం భారత దేశపు ఆర్ధిక మూలాలని ఒక దగ్గరికి చేరేలా చేస్తే, ఇదిగో ఇలా ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే.
— NelaTuriVenuGopalReddy (@megastar_1978) November 21, 2024