రేవంత్‌ అల్లుడిపై బిఆర్ఎస్ ఈడీకి ఫిర్యాదు

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి అల్లుడు గోలుగూరి సత్యనారాయణ, ఆయన ఇద్దరు సోదరులు గోలుగూరి రామకృష్ణ మరియు గొలుగూరి వెంకట్ రెడ్డి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున మాక్స్ బెయిన్ ఫార్మా కంపెనీపై బిఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ నేడు ఢిల్లీలో ఈడీకి ఫిర్యాదు చేశారు. 

వారి కంపెనీ కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్‌ నియోజకవర్గంలో చలగర్ల వద్ద భూసేకరణకు పూనుకుందని, ఇది ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగమే అని మన్నే క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. 

మాక్స్ బెయిన్ ఫార్మా కంపెనీలో సత్యనారాయణతో పాటు అన్నం శరత్ కూడా డైరెక్టర్‌గా ఉన్నారని, వీరిరువురు కలిసి వరంగల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్మిస్తే దానికి సిఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభోత్సవం చేశారని పిర్యాదులో పేర్కొన్నారు. 

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన బంధువులకు లబ్ధి కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా లగచర్లలో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని మన్నే క్రిశాంక్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈడీ ఆయన పిర్యాదుని స్వీకరించింది.