నేడు మహారాష్ట్రకు సిఎం రేవంత్‌

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ఒకసారి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. మళ్ళీ నేడు, రేపు (శని,ఆదివారం) ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్‌ చేరుకుంటారు.

అక్కడి నుంచి మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి చంద్రాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తర్వాత డిగ్రాస్,రాజేరా, వార్ధా నియోజకవర్గాలలో రోడ్ షోలు, ఎన్నికల సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈరోజు రాత్రి రేపు నాగ్‌పూర్‌లో బస చేసి రేపు (ఆదివారం) ఉదయం తెలంగాణ సరిహద్దు జిల్లా నాందేడ్ చేరుకుంటారు. నయాగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.         

నవంబర్‌ 19న సిఎం రేవంత్‌ వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు కాళోజీ కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీ మైదానం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్వయం సహాయ బృందాల మహిళలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ముఖ్యమంత్రి వరంగల్‌ పర్యటన, కార్యక్రమాలు, సభ ఏర్పాట్ల గురించి మంత్రి కొండా సురేఖ, సిఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, పోలీస్ అధికారులు నిన్న సచివాలయంలో సమావేశమై చర్చించారు.