అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 521 ఫలితాలు వెలువడగా వాటిలో డొనాల్డ్ ట్రంప్ 295 గెలుచుకోగా, ఆయనకు గట్టి పోటీ ఇచ్చిన కమలా హారిస్ 226 గెలుచుకున్నారు.
పాపులర్ ఓట్లలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఆమెపై స్పష్టమైన ఆధిక్యత సాధించారు. ట్రంప్‌కు 7,25,27,510 (50.9 శాతం), కమలా హారిస్‌కు 6,78,32,461 (47.6 శాతం) వచ్చాయి.
సెనేట్‌లో మెజార్టీ 50 కాగా ట్రంప్ నేతృత్వంలో రిపబ్లికన్లకు 52, కమలా హారిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాట్లకు 43 మాత్రమే రావడంతో సెనేట్‌పై కూడా ట్రంప్ ప్రభుత్వానికి పట్టు లభించింది.
ప్రతినిధుల సభలో మెజార్టీ 218 మార్కు కాగా, రిపబ్లికన్లకు 207, డెమొక్రాట్లకు 186 స్థానాలు లభించాయి.
డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ అధికార పార్టీని ఇంత భారీ మెజార్టీతో ఓడించి మళ్ళీ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతుండటం చాలా గొప్ప విషయమే.