నేటి నుంచి సచివాలయ భద్రత స్పెషల్ ప్రొటక్షన్‌ బాధ్యత

నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర సచివాలయ రక్షణ బాధ్యతని తెలంగాణ స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ (టిజిఎస్పీఎఫ్)కి ప్రభుత్వం అప్పగించింది. టిజిఎస్పీఎఫ్ కమాండంట్‌  దేవీదాస్ అధ్వర్యంలో మూడు షిఫ్టులలో మొత్తం 214 మంది 24 గంటలు సచివాలయానికి రక్షణ కల్పిస్తారు. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద, బహిరంగ ప్రదేశాలలో సాయుధ సిబ్బంది, లోపల గస్తీ సిబ్బంది ఉంటారు. ఈరోజు ఉదయం కమాండంట్‌  దేవీదాస్, తన సిబ్బందితో కలిసి ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సచివాలయం రక్షణ భాద్యతలు స్వీకరించారు. 

సచివాలయం నిర్మిస్తున్నప్పుడు, ఆ తర్వాత కొన్ని నెలల వరకు టిజిఎస్పీఎఫ్ సచివాలయం రక్షణ బాధ్యతలు చూసుకునేది. కానీ ఆ తర్వాత తెలంగాణ స్పెషల్ పోలీసులకు ఆ బాధ్యత అప్పగించారు. ప్రభుత్వం మారిన తర్వాత డిజిపి సూచన మేరకు అగ్నిమాపక శిక్షణ కూడా పొందిన టిజిఎస్పీఎఫ్‌కు సచివాలయ రక్షణ బాధ్యతలు అప్పగించింది.