సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ పడింది

సింగరేణి  కార్మికుల ఏటా దీపావళి పండుగకు ముందు ఉత్పత్తితో ముడిపెట్టి కొంత సొమ్ము బోనస్‌గా చెల్లిస్తుంటుంది. ఈ ఏడాది కూడా రూ.358 కోట్లు బోనస్‌గా సింగరేణి  సీఎండీ ఎన్‌.బలరాం ప్రకటించారు. సింగరేణిలు సుమారు 40,000 మంది కార్మికులున్నారు. కనుక ఒక్కొక్కరికీ సుమారు రూ.93,750 చొప్పున అందుకోనున్నారు.

ఈ మొత్తాలని శుక్రవారం మధ్యాహ్నం నుంచే కార్మికుల బ్యాంక్ ఖాతాలలో జమా చేయబోతోంది. చేస్తామని సీఎండీ ఎన్‌.బలరాం చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.50 కోట్లు బోనస్‌గా ప్రకటించామని చెప్పారు. సింగరేణి  కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తూ సంస్థకు లాభాలు తెచ్చిపెడుతున్నారని కనుక వారికి ఆ లాభాలలో వాటా ఇవ్వడం చాలా అవసరమని, అందుకే దీపావళికి 5 రోజుల ముందుగానే బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు.

సెప్టెంబర్‌ నెల జీతాలు యధాప్రకారం 1వ తేదీ నుంచి కార్మికుల ఖాతాలలో పడతాయి. కనుక ఆ జీతం, ఈ బోనస్‌ రెండూ కలిపి ఒక్కో కార్మికుడు సుమారు రూ.2 లక్షల వరకు అందుకోబోతున్నారు. తమ ప్రాణాలు, ఆరోగ్యం పణంగా పెట్టి రేయింబవళ్ళు భూగర్భ గనులలో, ప్రమాదకరమైన యంత్రాల నడుమ ఓపెన్ కాస్ట్ మైన్లలో పనిచేసే సింగరేణి కార్మికులకు ఎంత బోనస్‌ ఇచ్చినా తక్కువే అని భావించవచ్చు.