సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ డివై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. కనుక సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరుని ఆయన సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. కానీ పదవీ విరమణ సమయం దగ్గర పడుతున్నప్పుడు ఆయనకి ఈ గొప్ప అవకాశం లభించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025, మే 13నపదవీ విరమణ చేయనున్నారు. అంటే సుమారు ఆరు నెలలు పదవిలో ఉంటారన్న మాట! కానీ ఈ అత్యున్నతమైన ఈ పదవిలో ఒక్కరోజు పనిచేసి ఆ హోదాలో పదవీ విరమణ చేసినా అది గొప్ప గౌరవమే.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి హన్సరాజ్ మేనల్లుడే జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఆయన ఏడీఎం జబల్ పూర్ కేసులో ఇచ్చిన తీర్పుతో చాలా ప్రసిద్ధి చెందారు.