ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే, తెలంగాణలో ఓ ప్రధాన రాజకీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుకి ఆయన భార్య త్వరలో విడాకులు ఇవ్వబోతున్నారట! అతనికి తెలుగు సినీ హీరోయిన్లతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఈ కారణంగానే ఆయన తండ్రి కూడా దూరంగా ఉంచారట!
ఇంకా విశేషం ఏమిటంటే టిడిపికి చెందిన ఓ వ్యక్తి ఈ సంచలన పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం. కానీ దీనిపై సదరు రాజకీయ నాయకుడు ఇంకా స్పందించాల్సి ఉంది. అప్పుడే ఇది నిజమా కాదా? అనేది తెలుస్తుంది. ఒకవేళ నిజమే అయితే నిజంగానే తెలంగాణలో, రాజకీయాలలో ఇదో సంచలన వార్త అవుతుంది. లేకుంటే మరో పరువు నష్టం దావా పడుతుంది.