బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేదు? హరీష్

కేసీఆర్‌ హయాంలో ఏటా బతుకమ్మ పండుగకి ముందుగానే రాష్ట్రంలో అర్హురాలైన ప్రతీ మహిళకి రెండేసి నేత (బతుకమ్మ) చీరలు ప్రభుత్వం అందించేది. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన బతుకమ్మ పండుగకి కొత్త చీరలు కొనుక్కోలేని నిరుపేద మహిళలు కూడా కొత్త చీర కట్టుకొని సంతోషంగా పండుగ చేసుకోవాలని కేసీఆర్‌ భావించారు. బతుకమ్మ చీరలు నేసే పనిని చేనేత కార్మికులకి అప్పగించడం ద్వారా వారికీ ఏడాది పొడవునా పని, దాంతో ఆదాయం లభించేది. 

కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌లో ఘాటుగా విమర్శించారు. బతుకమ్మ చీరలు ఎందుకు పంపిణీ చేయలేదని అడిగితే మహిళా మంత్రి సీతక్క పొంతనలేని సమాధానం చెప్పి తప్పించుకున్నారని హరీష్ రావు ఆరోపించారు.

ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలను మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు.

తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతీ మహిళని ప్రతీ సంక్షేమ పధకానికి అర్హురాలైనప్పుడు వారిలో కొంతమందికి వర్తింపజేసి కొంతమందికి ఇవ్వకపోవడం మహిళలను మోసం చేయడం కాదా? అని హరీష్ రావు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే....