రాజీవ్ కుమార్‌ పయనిస్తున్న హెలికాఫ్టర్‌ ఎమర్జన్సీ ల్యాండింగ్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్‌ రాజీవ్ కుమార్‌కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈరోజు ఉదయం ఆయన, ఉత్తరాఖండ్ ఎన్నికల సంఘం అదనపు సీఈవో విజయ్‌ దేవరకొండ కుమార్‌ మరికొందరు అధికారులతో కలిసి ఉత్తరాఖండ్‌లోని మున్సియారీ అనే ప్రాంతానికి హెలికాఫ్టర్‌లో వెళుతుండగా దారిలో కొండల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఆకస్మికంగా వాతావరణంలో మార్పు ఏర్పడింది.

బలమైన ఈదురు గాలులు వీస్తూండటంతో అప్రమత్తమైన పైలట్ హెలికాఫ్టర్‌ని వెనక్కు మళ్లించిఓ పిథోరాఘడ్ జిల్లాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హెలికాఫ్టర్‌లో ఉన్న రాజీవ్ కుమార్‌తో సహా అందరూ సురక్షితంగా ఉన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు చెప్పారు. పైలట్ సకాలంలో వాతావరణంలో మార్పుని గమనించి వెనక్కు మళ్ళించడం వలన అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

అదే... పైలట్ మొండిగా ముందుకు తీసుకుపోయి ఉండి ఉంటే కొండలలో కూలిపోయి ఉండేదని అధికారులు చెప్పారు. చాలా చురుకుగా స్పందించి తమ ప్రాణాలు కాపాడినందుకు రాజీవ్ కుమార్‌తో సహా అందరూ పైలట్‌కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.