హైకోర్టుని ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రాస్, వాకాటి కరుణ, హరికిరణ్, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, శివశంకర్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్స్ వేశారు. వారందరూ తక్షణం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేయగా వారు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించారు.

కానీ ట్రిబ్యూనల్ కూడా వారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌ వెళ్ళాలని స్పష్టం చేసింది. దీంతో వారు హైకోర్టులో పిటిషన్లు వేశారు.  వారి పిటిషన్లు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈరోజు భోజన విరామం తర్వాత విచారణ చేపట్టనుంది. 

ఈ వ్యవహారంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకోకపోవచ్చు. కనుక హైకోర్టు కూడా ట్రిబ్యూనల్ తీర్పునే సమర్దిస్తూ తీర్పు చెప్పిన్నట్లయితే వారి ముందు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం రెండు డీవోపీటీ ఆదేశం పాటించి ఆంధ్రాకు తరలివెళ్లడం మూడు పదవులకు రాజీనామా చేయడం.