బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోనే రూ.80,500 కోట్లు అప్పులు చేశారని, అన్ని వేల కోట్లు తెచ్చినా ఎన్నికల హామీలు ఎందుకు అమలుచేయడం లేదు? ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా ఎందుకు నిర్మించలేకపోయారు? ఆనాడు మా ప్రభుత్వం అప్పు చేస్తే తప్పు అని వాదించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నారు? అంటూ నిప్పులు చెరిగారు.
తమ ప్రభుత్వం తెచ్చిన ప్రతీ పైసా అప్పుని రాష్ట్రంలో మౌలికవసతులు పెంచడానికి, ప్రాజెక్టులు కట్టడానికే వినియోగించామని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెస్తున్న వేలకోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతోంది? దాని లెక్కలు చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు.
— KTR (@KTRBRS) October 16, 2024
10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు!!
అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు..!
ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు..!!
మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు…