తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో కొంతమంది ఏపీ క్యాడర్‌కి చెందినవారున్నారు. వారిని అప్పుడే ఏపీకి కేటాయించినప్పటికీ ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. కానీ వారందరూ ఈ నెల 16వ తేదీలోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఆదేశించడంతో వారందరూ అభ్యంతరం తెలుపుతూ మళ్ళీ ట్రిబ్యూనల్‌లో పిటిషన్లు వేశారు.
అయితే వారి వాదనలు ట్రిబ్యూనల్ కొట్టి పడేయడమే కాకుండా రేపటిలోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై డీఓపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని దానిని ప్రశ్నించలేమని స్పష్టం చేసింది.
అయితే వారి వాదనలు పరిగణలోకి తీసుకొని కేంద్రానికి, డీఓపీటీకి నోటీస్ జారీ చేసి కౌంటర్‌గానే దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణని నవంబర్ 5వ తేదీకి వాయిదా ఆవేసింది.
ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించినవారిలో ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణా, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రోనాల్డ్ రాస్, ప్రస్తుతం ఏపీలో చేస్తున్న సృజన ఉన్నారు.