కేంద్ర ఎన్నికల కమీషన్ కొద్ది సేపటి క్రితమే మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని, ఝార్ఖండ్ రాష్ట్రంలో నవంబర్ 13,20 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు.
రెండు రాష్ట్రాలకు నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున నేటి నుంచి రెండు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని రాజీవ్ కుమార్ చెప్పారు.