హర్యానా రాష్ట్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నెల 17వ తేదీన పంచకులలోని దసరా మైదానంలో ఉదయం 10 గంటలకు హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశం నలుమూలల నుంచి బీజేపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఈసారి హర్యానాలో బీజేపీ ఓడిపోతుందని అన్ని మీడియా సంస్థలు జోస్యం చెప్పగా, బీజేపీయే గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తోంది.
జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ఉమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.