భారత్‌ సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉగ్రవాదులు

జమ్మూ కశ్మీర్‌లో అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు సరిహద్దు భద్రతా దళంలోని 161వ యూనిట్‌కి చెందిన సైనికులు మంగళవారం సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలిస్తున్నప్పుడు, ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరు బుల్లెట్ గాయాలతో తప్పించుకొని తిరిగి వచ్చాడు కానీ మరో సైనికుదూ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. 

మిగిలిన సైనికులు అతని కోసం అడవిలో గాలించగా, ఒక చోట కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలతో రక్తమోడుతున్న అతని మృతదేహం లభించింది. సైనికులు అతని మృతదేహాన్ని అక్కడి నుంచి అనంత్ నాగ్ జిల్లా కేంద్రంలోని ఆర్మీ హాస్పిటల్‌కి తరలించారు. ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకొని వచ్చిన మరో సైనికుడుకి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అతనికి కూడా తీవ్ర గాయాలైనప్పటికీ సకాలంలో చికిత్స అందడంతో అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.