తెలంగాణ దేవాదాయశాఖలో 33 మందికి పదోన్నతులు

 తెలంగాణ దేవాదాయశాఖలో దశాబ్ధాలుగా జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 33 మందికి గ్రేడ్-3 ఈవోలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ శనివారం జీవో (నంబర్‌ 134) జారీ చేసింది. పదోన్నతి పొందిన 33 మంది ఉద్యోగులకు మంత్రి కొండా సురేఖ నిన్న సచివాలయంలో స్వయంగా పదోన్నతి లేఖలు అందజేసి అభినందించారు. 

తమకు పదోన్నతి కల్పించాలని దశాబ్ధాలుగా వారందరూ ప్రభుత్వాలను వేడుకొంటూనే ఉన్నారు. కానీ తమ గోడు ఎవరు పట్టించుకోలేదని, పదోన్నతులపై ఆశ వదులుకున్నామని కానీ ఇన్నేళ్ళ తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డి తమకి పదోన్నతి కల్పించారని చెపుతూ వారందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారందరూ ఈ విషయంలో తమకు సాయపడిన మంత్రి కొండా సురేఖకు, సిఎం రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలుపుకున్నారు. దేవాదాయశాఖలో గ్రేడ్-1,2 ఈవోలకు ఇప్పటికే పదోన్నతి పొందారు.