ఢిల్లీ మాజీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం కేటాయించిన అధికార నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించారు. ఇంతకాలం ఆయన తన కుటుంబంతో కలిసి ఢిల్లీ నడిబొడ్డున సివిల్ లైన్స్ పరిధిలో గల ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులో నివాసం ఉండేవారు.
అక్కడి నుంచి ఆమాద్మీ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలో గల మరో భవనంలోకి మారారు. దానిని ఆమాద్మీ రాజ్యాసభ సభ్యుడు అశోక్ మిత్తల్‌కి కేటాయించగా ఆయనకు అది అవసరం లేకపోవడంతో ఖాళీగా వదిలేశారు. కనుక అర్వింద్ కేజ్రీవాల్ ఆ భవనంలోకి మారారు.
సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయిన ఎంపీ, ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన ప్రభుత్వ భవనాలు ఖాళీ చేయకుండా అధికారులను ముప్పాతిప్పలు పెడుతుంటారు. కానీ కానీ కేటాయిస్తే కానీ ప్రభుత్వంలో ఎవరూ అడగకపోయినా, స్వచ్ఛందంగా ఆయన తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించేశారు.