తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఓ స్పెషల్ సిట్ వేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం జరిపిస్తున్న సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని, కనుక సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరిపించాలని కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు సుప్రీంకోర్టులో కేసులు వేశారు. వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు స్వతంత్రంగా పనిచేసే మరో సిట్ ఏర్పాటు చేసింది.
ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇద్దరు పోలీస్ అధికారులు, ఎఫ్ఎస్ఏఈ నుంచి ఓ సీనియర్ అధికారి దీనిలో సభ్యులుగా ఉంటారు. సీబీఐ డైరెక్టర్ దీనిని పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది.
జగన్ హయాంలో తిరుమలకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయ్యిందని జాతీయ ల్యాబ్ నివేదికలో పేర్కొంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ సిట్ కూడా అదే నిర్ధారిస్తే వైసీపి, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి మరో పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది.