తెలంగాణ మహిళా కమీషన్‌ ఏమందంటే...

గత రెండు రోజులుగా మీడియాలో మంత్రి కొండా సురేఖ పేరు మారుమ్రోగిపోతోంది. అక్కినేని కుటుంబం, నటి సమంత గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉండటంతో తెలంగాణ మహిళా కమీషన్‌ జోక్యం చేసుకొని మంత్రి కొండా సురేఖని వివరణ కోరాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కానీ ఇంతవరకు ఎవరూ మహిళా కమీషన్‌కు మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేయలేదు. అయినా మహిళా కమీషన్‌ ఈ వివాదంపై స్పందిస్తూ మంత్రి కొండా సురేఖ సమంతకి క్షమాపణలు చెప్పుకొని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు కనుక ఆమెకి నోటీస్‌ ఇచ్చి వివరణ కోరవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

మహిళా కమీషన్‌ ఆమెని వెనకేసుకువస్తున్నప్పటికీ, అక్కినేని నాగార్జున, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేస్తున్న పరువు నష్టం దావా కేసులలో మంత్రి కొండా సురేఖకి నోటీసులు అందుకోక తప్పదు. వాటిపై న్యాయపోరాలు చేయక తప్పదుగా?