విజయశాంతి చక్కటి సలహా... అందరికీ అవసరమే

మంత్రి కొండా సురేఖని టాలీవుడ్‌లో ఇంకా విమర్శించనివారు ఎవరూ లేరనే చెప్పవచ్చు. అందరూ పోటీలు పడి ఆమె వ్యాఖ్యలు ఖండించేశారు. చివరిగా సీనియర్ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి కూడా ఆమెను ఉద్దేశ్యించి ఓ రెండు ముక్కలనేశారు. అయితే  పేరు పెట్టి విమర్శించకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు, స్వర్గీయ అల్లు రామలింగయ్యలు ఇదివరకు ఎన్నాడో చెప్పిన రెండు మంచి ముక్కలను ట్వీట్‌ చేశారు. 

“ఏదైనా మాట్లాడే ముందు మనిషి యొక్క రెండో ఆలోచన, విశ్లేషణ.....ఆ వ్యక్తికి నిజమైన స్నేహితమని శ్రీ ఏఎన్ఆర్ గారు చెప్పినట్లు చూసాను ఒక ఛానల్‌ల.. జీవితాన్ని చదివి చూసిన మహోన్నతుల మాటలు ఎన్నటికీ సమాజానికి కూడా సందేశాత్మకాలే... 

శ్రీ అల్లు రామలింగయ్య గారు మాతో ఎప్పుడూ చెప్పే ఒక్క మాట కూడా ఇక్కడ ప్రస్తావించాలి. మనం మాట్లాడిన మాటకు మనం బానిసలం, మాటలాడని మాటకు మనమే యజమానులం అని. 

హర హర మహాదేవ్ జై శ్రీరామ్... జై శ్రీ కృష్ణ... జై తెలంగాణ” అని విజయశాంతి ట్వీట్‌ చేశారు. నిజమే కదా!