సమంతా... క్షమించు: కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో పలువురు తీవ్రంగా స్పందిస్తూ ఆమె తీరుని తప్పు పడుతుండటంతో, ఆమె వెనక్కు తగ్గారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపుని ప్రశ్నించడానికే నేను ఆవిదంగా మాట్లాడాను తప్ప ఎవరినీ బాధ పెట్టాలని కాదు.

సమంత మనోభావాలను దెబ్బ తీయాలనే ఆలోచనే లేదు నాకు. సినీ పరిశ్రమలో ఆమె సొంతంగా ఎదిగిన తీరుతో నాకు ఆమె పట్ల చాలా అభిమానం ఉంది. ఆమె పోరాట స్పూర్తి నాకు ఆదర్శం కూడా. నా వ్యాఖ్యలతో సమంత కానీ ఆమె అభిమానులు మరెవరైనా నొచ్చుకొని ఉంటే వారందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకొంటున్నాయను. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నాను,” అని అన్నారు. 

అయితే మంత్రి కొండా సురేఖ సమంతకి క్షమాపనలు చెప్పారే కానీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కి చెప్పకపోవడం గమనార్హం.

తనని ఉద్దేశ్యించి తీవ్ర ఆరోపణలు చేయడంతో కేటీఆర్‌ ఆమెని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే పరువు నష్టం, క్రిమినల్ కేసు రెండూ వేస్తానని హెచ్చరించారు. కానీ ఆమె చెప్పలేదు కనుక ఈ వ్యవహారం ఏవిదంగా సాగుతుందో... ముగుస్తుందో?రాబోయే రోజుల్లో తెలుస్తుంది.