బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సిఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న గనుల శాఖలో నకిలీ పత్రాలు, రసీదులు సృష్టించి రూ. 150 కోట్లు విలువైన 1.5 లక్షల టన్నుల ఇసుక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనుల కోసం అంటూ ఇంటి దొంగలు ఇంత భారీగా దోపిడీకి పాల్పడుతుంటే సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఈ దోపిడీ జరుగుతోందా?అని కేటీఆర్ ప్రశ్నించారు.
సిఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే తక్షణం ఈ ఇసుక దోపిడీ, గనుల శాఖలో జరుగుతున్న ఈ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి కటిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఏవిదంగా స్పందిస్తుందో?
రేవంత్ గనుల శాఖలో అవినీతి ఘనులు!
— KTR (@KTRBRS) September 28, 2024
ఫేక్ డాక్యుమెంట్లు, రసీదులు పుట్టించి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రూ. 150 కోట్ల విలువచేసే 1,50,000 టన్నుల ఇసుకను దోచేశారు.
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసం అంటూ తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను దారి మళ్లించిన… pic.twitter.com/h0MPm726RM