నటుడు ప్రకాష్ రాజ్ దేశ ప్రజలందరిలాగే సోషల్ మీడియాలో వివిద అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే ఆయన ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు కనుక ఆ విమర్శలలో కొన్ని మోడీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం గురించి కూడా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దీక్ష చేపట్టడంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా బదులిచ్చారు. సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చినా ఊరుకోనని హెచ్చరించారు.
అయితే ప్రకాష్ రాజ్ కూడా వెనక్కు తగ్గలేదు. నేను చెప్పింది ఏమిటి మీరు మాట్లాడింది ఏమిటి? ఓసారి నేను ఏం ట్వీట్ చేశానో చదువుకొని అర్దం చేసుకోండి. ప్రస్తుతం నేను విదేశంలో సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఈ నెల 30న తిరిగి రాగానే మీ ప్రతీ మాటకి నేను జవాబు చెపుతాను,” అని ట్వీట్ చేశారు.
అయితే మళ్ళీ ఆయనే ఈ నాలుగు రోజులూ కూడా ఓపిక పట్టలేన్నట్లు నేడు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి మరో ట్వీట్ బాణం వేశారు. ప్రకాష్ రాజ్ మాటల్లోనే...