ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి నుంచి 11 రోజులపాటుదీక్ష చేపట్టారు. తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం మహాపచారమని, దానికి ప్రాయశ్చిత్తంగా నేడు నేడు గుంటూరు జిల్లా నంబూరులో శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు.
11 రోజుల దీక్ష తర్వాత తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటానని ట్వీట్ చేశారు. ఈ విషయం తెలియజేస్తూ ట్విట్టర్లో “ఏడుకొండలవాడా... క్షమించు! నీకు జరిగిన మహాపచారానికి ప్రాయశ్చిత దీక్ష చేసుకొని వచ్చి దర్శనం చేసుకుంటాను....” అంటూ పవన్ కళ్యాణ్ పెద్ద మెసేజ్ పెట్టారు.
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేని గత ప్రభుత్వం ఇంత అకృత్యానికి పాల్పడిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని పునరుద్ధరించుకునేందుకు ఈ దీక్ష చేపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ దీక్ష గురించి ఏమి చెప్పారో ఆయన మాటల్లోనే....