హైడ్రాకి మరింత శక్తివంతం... 1109 మంది సిబ్బంది కేటాయింపు!

సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు... 

• హైడ్రా చట్టబద్దత, సర్వాధికారాలు.

• అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు పరిరక్షణ, వాటి ఎఫ్‌టిఎల్, బఫర్ బఫర్ జోన్‌ పరిరక్షణ బాధ్యత హైడ్రాకి అప్పగింత.

• అవుటర్ రింగ్ రోడ్ లోపల గల 27 స్థానిక సంస్థలు, 51 గ్రామ పంచయితీలు హైడ్రా పరిధిలోకి.    

• హైడ్రా పరిధి, బాధ్యతలు పెంచినందున వివిద ప్రభుత్వ శాఖల నుంచి పదోన్నతిపై 169 మంది అధికారులు హైడ్రాకి బదిలీ. అవుట్ సోర్సింగ్ పద్దతిలో 940 మంది సిబ్బంది నియమకానికి ఆమోదం. 

• ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఇకపై హైడ్రా కూడా సర్వాధికారాలతో పనిచేస్తుంది. 

త్వరలో జరిగే శాసనసభ సమావేశాలలో ఈ మేరకు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేస్తుంది. ఆలోగా పైన పేర్కొన్న పరిధి, బాధ్యతలు, అధికారాలు హైడ్రాకి కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ జారీ చేస్తుంది.