జానీ మాస్టర్‌ కేసు కేవలం అత్యాచారం కాదు: రాజాసింగ్

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ వ్యవహారాన్ని అందరూ లైంగిక వేధింపులు, అత్యాచార నేరంగానే చూస్తున్నారు కానీ బీజేపీ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిని ‘లవ్ జిహాదీ’ (ప్రేమ పేరుతో మత మార్పిడి)    అంటూ మరో కొత్త కోణం చూపుతున్నారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఇటువంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. జానీ మాస్టర్‌ వంటివారిని కటినంగా శిక్షించాల్సిందే. అతను చేసింది కేవలం అత్యాచారం మాత్రమే కాదు లవ్ జిహాదీ కూడా చేశారు. అతను ఈ ఒక్క అమ్మాయినే కాదు ఇంకా ఎంత మంది అమ్మాయిల జీవితాలతో ఇలా ఆడుకున్నాడు?ఎంతమందిని ఈవిదంగా మత మార్పిడులు చేయించారో కూడా పోలీసులు విచారించి బయటపెట్టాలి. 

చాలా మంది ప్రజలు సినిమాలలో హీరో, హీరోయిన్లను స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ ఇట్లాంటి వ్యక్తుల వలన సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుంది. సినీ ఇండస్ట్రీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, ఏ సినీ పరిశ్రమలో కూడా మళ్ళీ ఇటువంటివి జరగకుండా ఆయా ఇండస్ట్రీలు అవసరమైన చర్యలు చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను,” అని రాజాసింగ్ అన్నారు.