వట్టెం పంప్‌ హౌస్‌ మునిగిపోతే పట్టించుకోరా? కేటీఆర్‌

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశ్యించి వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. “పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పధకంలో భాగంగా ఏర్పాటుచేసిన వట్టెం పంప్‌ హౌస్‌లోని బాహుబలి మోటర్లు సెప్టెంబర్‌ 3 నుంచి వరద నీటిలో మునిగిపోయి ఉంటే, ఇంతవరకు పంప్‌ హౌస్‌లో నీటిని తోడి బయట పోయలేదు. పంప్‌ హౌస్‌లో 19 మీటర్ల మేర వరద నీరు నిండితే ఇంతవరకు కేవలం ఒక్క మీటరు మేర నీటిని మాత్రమే తోడిపోశారు.

ఇంత అత్యవసర పరిస్థితిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంప్యూటర్లు, వాటి మూలాలని మళ్ళీ కొత్తగా కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ పెద్దలని ప్రసన్నం చేసుకోవడానికి విమానాలలో తిరుగుతూ బాధ్యతలను విస్మరిస్తున్నాడు మన పాలమూరు బిడ్డ. నేను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు ప్రయోజనం చేకూర్చేవాటన్నిటినీ ఎందుకు నాశనం చేస్తున్నారు?” అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కేటీఆర్‌ ప్రశ్నకు సిఎం రేవంత్‌ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ ఏమని సమాధానం చెపుతారో?