తెలంగాణ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి సీఐడీ నోటీస్ జారీ చేశారు. బిఆర్ఎస్ హయాంలో బిగ్‌బాస్ లీప్ టెక్నాలజీస్ అండ్ సోల్యూషన్స్ అనే సంస్థ ఎటువంటి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండానే రూ.25.51 కోట్లు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందేందుకు బిల్లులు పెడితే వాటికి ఆయన అనుమతించారనేది ఆరోపణ.
ఈ కేసులో ఆయనతో పాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమీషనర్‌గా కాశీ విశ్వేశ్వర రావు, డెప్యూటీ కమీషనర్‌గా శివరాం ప్రసాద్, హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు నిందితులుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ పోలీసులు వీరికి నోటీసులు పంపించింది.
ఇటీవల క్రైమ్ సెంట్రల్ స్టేషన్ పోలీసులు విచారణ జరిపినప్పుడు వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ పేరుతో రూ.1,500 కోట్ల భారీ కుంభకోణం బయటపడింది.
వాణిజ్య పన్నుల శాఖకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తున్న హైదరాబాద్ ఐఐటి, పన్ను చెల్లింపులలో రిటర్న్స్ దరఖాస్తులలో అవకతవకల్లుంటే వాటిని గుర్తించేందుకు తోడ్పడాల్సి ఉండగా, నిందితులు నిర్లక్ష్యం కారణంగా రూ.1,400 కోట్లు అవినీతి జరిగిన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తుని సీఐడీకి అప్పగించడంతో ఇప్పుడు సోమేష్ కుమార్‌తో సహా వారు ఐదుగురికీ నోటీసులు జారీ చేశారు.