త్వరలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం

ఈ నెల 20వ తేదీన రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. సాయంత్రం 4 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం జరుగబోతున్నట్లు మంత్రులందరికీ సీఎంవో సమాచారం ఇచ్చింది.

ఈ సమావేశంలో హైడ్రా పరిధిని మరింత విస్తరించి దానికి చట్టబద్దత, మరిన్ని అధికారాలు కల్పించడం, హైడ్రా కూల్చివేతలపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నందున ఇకపై ఏవిదంగా ముందుకు సాగాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

వరదలతో నష్టపోయిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో పునరావాస చర్యలు, వరదల పంట నష్టానికి పరిహారం చెల్లింపు, వరదలతో దెబ్బ తిన్న రోడ్లు మరమత్తులు, పునర్నిర్మాణం తదితర అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 

స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ, కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లు తదితర అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు.