బిఆర్ఎస్‌ని బ్రతికించుకోవాలని పాపం ఆరాటపడుతున్నారు!

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మద్య మొదలైన వాగ్వాదాలని, బిఆర్ఎస్‌ నేతలందరూ కలిసి పెంచి పెద్దవి చేసి దాంతో చచ్చిపోయిన తమ పార్టీకి మళ్ళీ ప్రాణం పోయాలని ఆశ పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అయితే ఓసారి చచ్చిన మనిషిని బ్రతికించడం ఏవిదంగా సాధ్యం కాదో చచ్చిన బిఆర్ఎస్‌ పార్టీని కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రతికించడం సాధ్యం కాదని అన్నారు. 

తాము తలుచుకుంటే బిఆర్ఎస్‌ నేతలు ఒక్కరూ కూడా బయట తిరగలేరని కానీ తామందరం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే కాంగ్రెస్ పార్టీకి చెందినవారం కనుక చాలా సంయమనం పాటిస్తున్నామని అన్నారు. కనుక బిఆర్ఎస్‌ నేతలు తమ సహనాన్ని పరీక్షించవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్‌ శ్రేణులు కూడా సంయమనం పాటించాలని బిఆర్ఎస్‌ నేతలు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ ఎవరూ దుందుడుకుతనం ప్రదర్శించవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. 

శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద బిఆర్ఎస్‌ పార్టీ సమావేశం నిర్వహిస్తామని చెప్పడంతో, ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు హరీష్ రావుతో సహా బిఆర్ఎస్‌ నేతలందరినీ చేశారు. తమని గృహ నిర్బంధం చేయడంపై వారు పోలీసులపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు ఎవరినీ బయటకు వెళ్ళనీయలేదు.