ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినందున సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన్నట్లుగానే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ఓ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రి దామోదర రాజానర్సింహ ఉపాధ్యక్షుడుగా ఉంటారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌ ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఎంపీ మల్లు రవి దీనిలో సభ్యులుగా ఉంటారు. ఎస్సీ వర్గీకరణతో ముడిపడి ఉన్న అన్ని అంశాలపై వీరు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అవసరమైన బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పిస్తుంది. ఈ ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సవ్యంగా సాగితే రెండు మూడు నెలల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది.