సీతారాం ఏచూరి ఇక లేరు!

ప్రముఖ జాతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఈరోజు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత నెల 19న ఊపిరి తిత్తులలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నేడు ఆయన పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు. 

సీతారాం ఏచూరి 1992 నుంచి సీపీఎం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. 2005 నుంచి 2017వరకు రాజ్యసభ సభ్యుడుగా పనిచేసినప్పుడు దేశానికి సంబందించిన పలు అంశాలపై పూర్తి అవగాహన కలిగి సాధికారకతతో మాట్లాడగల మంచి వక్తగా పేరు సంపాదించుకున్నారు. రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూనే, వివిద పత్రికలు ‘కాలమిస్ట్’గా చక్కటి ఆర్టికల్స్ వ్రాశారు. సీతారాం ఏచూరి జాతీయస్థాయి రాజకీయ నాయకుడుగా ఎదిగినప్పటికీ దేశంలో పేద ప్రజలు, కర్షకులు, కార్మికుల పట్ల చాలా ప్రేమాభిమానాలు కనబరిచేవారు. 

ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.