తెలంగాణలో కుల గణన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపధ్యంలో ఎర్ర సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయ్న తరపున వాదించిన న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ని, బీసీ కుల గణన ప్రక్రియని నెలల తరబడి సాగదీయకుండా నిర్ధిష్ట కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుని అభ్యర్ధించారు.
ఎర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఆయన న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ, మూడు నెలలోగా బీసీ కులగణన ప్రక్రియని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కుల గణన ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ఆ నివేదికని హైకోర్టుకి సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.