బీసీ, వ్యవసాయ, విద్యా కమీషన్లకు చైర్మన్లు వీరే

తెలంగాణ ప్రభుత్వం బీసీ కమీషన్, వ్యవసాయ కమీషన్, విద్యా కమీషన్లకు చైర్మన్, సభ్యులను నియమించింది. బీసీ కమీషన్‌కు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి, సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరిఓ సురేందర్, బాలలక్ష్మిలని నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చేపట్టబోయే కులగణనలో ఈ కమీషన్‌ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.  

వ్యవసాయ, రైతు సంక్షేమ కమీషన్‌ ఛైర్మన్‌గా సీనియర్ కాంగ్రెస్‌ నేత ఎం. కోదండరెడ్డిగా నియమించింది కానీ ఇంకా సభ్యులను నియమించలేదు. 

విద్యా కమీషన్‌కు ఛైర్మన్‌ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఛైర్మన్‌గా నియమించింది. ఈ కమీషన్‌లో కూడా అయింకా సభ్యులని నియమించలేదు. 

ఈ మూడు కమీషన్ల పదవీకాలం రెండేళ్ళు ఉంటుంది.