నామా నాగేశ్వరరావుపి ఈడీ కేసు నమోదు

బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుపై ఈడీ మనీలాండరింగ్ కేసులో నేడు కోర్టులో ఛార్జ్ షీట్‌ దాఖలు చేసింది. నామాకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్, రాంచి ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్ కంపెనీలు రాంచీ-జంషెడ్‌పూర్ మద్య నాలుగులేన్ల జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. దానిని చూపించి బ్యాంకుల నుంచి రూ.1,030 కోట్లు రుణం తీసుకున్నాయి. 

కానీ ఆ నిధులలో రూ.365.78 కోట్లు తమ సూట్‌కేసు కంపెనీలకు మళ్లించాయని సీబీఐ ఆరోపించింది. ఆ రెండు కంపెనీలు బ్యాంకు నుంచి రూ.1,030 కోట్లు డబ్బు తీసుకుని వేరే అవసరాలకు వాడుకున్నాయి కానీ ఇంతవరకు హైవే రోడ్ ప్రాజెక్టు పూర్తిచేయలేదు. కనుక ఇది మనీ లాండరింగే అంటూ ఈడీ మరో కేసు నమోదు చేసింది.  

ఆ కేసులోనే ఈడీ ఇదివరకు మధుకాన్ కంపెనీలో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన బ్యాంకులోని రూ.96.21 కోట్లు ఫ్రీజ్ చేయడమే కాకుండా 101 చిర, స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంది.