తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో కేసముద్రం వద్ద అయోధ్య గ్రామంలో చెరువుకి గండి పడటం వరదనీరు సమీపంలో ఉన్న రైల్వేట్రాక్‌వైపు ఉదృతంగా ప్రవహించాయి. ఆ ధాటికి సుమారు 100-150 అడుగుల పొడవునా రైల్వే ట్రాక్ క్రింద ఉండే కంకర వగైరా కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్ గాలిలో వ్రేలాడుతోంది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఆ మార్గం గుండా ప్రయాణించే విజయవాడ-కాజీపేట రైళ్ళన్నిటినీ నిలిపివేశారు. వరద ప్రవాహం తగ్గితేగానీ రైల్వే ట్రాక్ పునరుద్దరించడం సాధ్యం కాదు కనుక అంతవరకు ఆ మార్గంలో రైళ్ళు రాకపోకలు సాగించలేవు.
విజయవాడ, గుంటూరు నగరాలలో భారీ వర్షాలు పడుతుండటంతో ఆ రెండు రైల్వేస్టేషన్లలో పట్టాలు నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. కనుక ఇప్పటికే పలు రైళ్ళు రద్దు చేశారు. ఇప్పుడు ఈ మార్గంలో కూడా రైళ్ళు రద్దయ్యాయి.