కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసి ఘోష్ కమీషన్ గడువు ఆగస్ట్ 31తో ముగియడంతో, అక్టోబర్ 31 వరకు మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు క్రుంగిపోవడం, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గోడలకు భారీగా పగ్గుళ్ళు ఏర్పడి నీళ్ళు కారిపోతుండటం, ఇంకా మేడిగడ్డ బ్యారేజి ప్రదేశం ఎంపికలో జరిగిన పొరపాట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసి ఘోష్ కమీషన్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పలువురు ఉన్నతాధికారులు, ఇంజనీర్లను జస్టిస్ పీసి ఘోష్ విచారణకు పిలిపించి వివరణ తీసుకున్నారు.
ఈ విచారణ గడువు జూన్ నెలాఖరుకాగా పూర్తికాక పోవడంతో ఆగస్ట్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. అయినా విచారణ పూర్తికాకపోవడంతో అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగించింది.