సిఎం రేవంత్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదల కావడంపై సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.

బీజేపీతో బిఆర్ఎస్ పార్టీ డీల్ చేసుకున్నందునే కల్వకుంట్ల కవితకి బెయిల్‌ లభించిందని అన్నారు. దీనినే సుప్రీంకోర్టు తప్పు పట్టింది.

ఓటుకి నోటు కేసుని మద్యప్రదేశ్‌కి బదిలీ చేయాలనే జగదీష్ రెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు, జస్టిస్ గవాయ్ సిఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. 

“మేము రాజకీయ పార్టీలను సంప్రదించి తీర్పులు చెప్పము. కానీ అలా చెపుతున్నామన్నట్లు రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సరికాదు. సుప్రీంకోర్టు పట్ల ఈవిదంగా మాట్లాడటం సరికాదు. ముఖ్యమంత్రిగా ఉన్నవారు సుప్రీంకోర్టుని గౌరవించడం అవసరం. 

అయితే ఎవరు ఏమనుకున్నప్పటికీ న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగానే పనిచేస్తుంటుంది. ఈ వంకతో ఓటుకి నోటు కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని కోరడం సరికాదు. న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా చేస్తుంది. కనుక ఈ కేసులో నిష్పక్షపాత విచారణ కొరకు స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ని నియమిస్తాము,” అని జస్టిస్ గవాయ్ అన్నారు.