సిఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు. అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదు. తెలంగాణకి గుండెకాయ వంటిది సచివాలయం. కానీ కేసీఆర్‌తో సహా మంత్రులు ఎవరూ సచివాలయానికి వచ్చేవారే కారు.
కేసీఆర్ విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని, దాని చుట్టూ ఎత్తైన ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేయించుకున్నారు. సామాన్య ప్రజలెవరికీ దానిలోకి ప్రవేశం ఉండేదే కాదు. కానీ మేము అధికారంలోకి రాగానే ముందుగా ఆ ఇనుప బ్యారికేడ్లు తొలగించి, దాని పేరుని ప్రజాభవన్‌గా మార్చి సామాన్య ప్రజల నుంచి అక్కడే వినతి పత్రాలు తీసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తున్నాము.
మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు మేము ఏర్పాటు చేస్తుంటే రాజకీయాలు చేస్తున్నారు. ఆనాడు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ సాకారం అయ్యింది. కనుక డిసెంబర్ 9న ఆమె పుట్టినరోజు నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేసుకుందాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="te" dir="ltr">డిసెంబర్ 9న లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ <a href="https://t.co/gIHjao2Tlz">pic.twitter.com/gIHjao2Tlz</a></p>— Telangana Congress (@INCTelangana) <a href="https://twitter.com/INCTelangana/status/1828745279199428730?ref_src=twsrc%5Etfw">August 28, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>